6 ఏళ్ల భీమ్ (Bheem) అనే శునకం అకాల మృతి..
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం పెంటపల్లి లో పెనుగుల రవీంద్ర, బేబీ కుటుంబ సభ్యులు అల్లాడి ముద్దుగా పెంచుకుంటున్న 6 ఏళ్ల భీమ్ (Bheem) అనే శునకం అకాల మృతి చెందడం తో కుటుంబం మొత్తం కన్నీటి పర్యంతమయ్యారు. కుక్క పై ఉన్న ప్రేమ దాని మధుర క్షణాలు మర్చిపోలేక హత్తుకుని గుండెలు పగిలేలా కుమారుడు నూతన్ ఏడ్చాడు. అతని ఏడుపుతో గ్రామంలో కుక్కపై ఉన్న ప్రేమ అందరిని కలచివేసింది.
భీమ్ కు ప్రతి ఏటా పుట్టినరోజు వేడుకలు..
పెనుగుల రవీంద్ర, బేబీలకు ఒక కుమారుడు నూతన్ అనే యువకుడు ఉన్నాడు. అయినప్పటి జంతువులు పై ఉన్న అమిత ప్రేమ వారిని రెండవ సంతానంగా భీమ్ అనే కుక్కను ఆరేళ్లుగా పెంచుకుంటున్నారు. దీనికి ప్రతి ఏటా పుట్టినరోజు వేడుకలును కూడా భారీ కేక్ ను కట్ చేసి పలువురుకి భోజనాలను కూడా పెడుతూ ఘనంగా జరిపేవారు. అల్లారుముద్దుగా ఇంటిలో ప్రాణంగా పెంచుకున్న భీమ్ అనే హచ్ కుక్క చనిపోవడంతో ఒక్కసారిగా తమ కుమారుడు, కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురై వారం రోజులుగా తిండి తిప్పలు మాని దిగాలు పడిపోయారు. హచ్ కుక్క మృతి తో మానవ జీవితంలో మనిషికి ఏ రీతిలో అంత్యక్రియలు చేస్తారో.. అదే రిథిలో తమ కుటుంబీకులు, చుట్టాలు అందరూ వచ్చి, కుక్క ఫొటోకు పూలమాలలు తో నివాళులర్పించారు.
భీమ్ కు స్మశానవాటికలో అంత్యక్రియలు..
కుటుంబ సభ్యులతో ఆడిపాడిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కుక్కను బాణా సంచాలతో, పుష్పాలను జల్లుతూ స్మశానవాటికలో అంత్యక్రియలను పూర్తి చేశారు. లోకంలో మనిషి పై విశ్వాసం కన్నా కుక్కలపై విశ్వాసం ప్రేమ వీళ్ళను చుస్తే మనకు కూడా ఇలానే ఉండాలని పించేలా, మూగజీవాలను అమితంగా ప్రేమించాలని, వాటిని ప్రేమిస్తే మర్చిపోవడం చాలా కష్టం అంటూ స్థానికులు అంటున్నారు. మరో రెండు రోజుల్లో కుక్క మృతి పై ఒక ఫ్లెక్సీ వేసి, దానికి పెద్ద కార్యం కూడా నిర్వహిస్తున్నారని, ప్రతి ఒక్కరు వచ్చి కుక్క ఆత్మకు శాంతి కలిగెల చూడాలని కుటుంబ సభ్యులు ఓదార్పుకు వచ్చినవాళ్లకు చుట్టాలు చెబుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి