భట్టిప్రోలు మండల పరిధిలో 8 నేరాలతో సంబంధం ఉన్న 7గురు ముద్దాయిలను అరెస్టు చేసినట్లు డి.ఎస్.పి, టీ.మురళీకృష్ణ తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో వేమూరు సిఐ పసుపులేటి రామకృష్ణ, భట్టిప్రోలు ఎస్ ఐ కాసుల శ్రీనివాసరావులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏడుగురు ముద్దాయిలతోపాటు మరో మైనర్ బాలుడిని అదుపులోనికి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ముద్దాయిలు ఈనెల 20వ తేదీన ఎన్ హెచ్ 216 రహదారి మార్గంలో ఐలవరం గ్రామంలో మోటార్ సైకిల్ ను అర్ధరాత్రి దొంగిలించినట్లు ఆయన తెలిపారు. గతంలో ఈ ముద్దాయిలు భట్టిప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు మోటర్ సైకిల్లు, కర్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మోటార్ సైకిల్ దొంగిలించటానికి ఇన్నోవా కార్ ఉపయోగించామని తెలిపారు .రూ3 లక్షల 80 వేల విలువ కలిగిన ఆరు మోటర్ సైకిల్ ను స్వాధీన పరుచుకొని దొంగతనానికి వీరు ప్రయాణించిన ఇన్నోవా కార్లు కూడా స్వాధీన పరుచుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనలో పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం సీతారాంపురం తండా కు చెందిన సుగాలి మీరా జ్యోతి ప్రసన్నకుమార్ నాయక్, మరో ముద్దాయి అదే తండాకు చెందిన రమావత్ దుర్గాప్రసాద్ నాయక్, ఈపూరు మండలం దుస్మాన్ పేటకు చెందిన బాణావత్ తులసి బాబు నాయక్, సీతారాంపురం తండా కు చెందిన బాణావత్ హనుమాన్ నాయక్ లని ఆయన తెలిపారు.
*మరో కేసులో జనవరి 27వ తేదీ భట్టిప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రామానికి చెందిన పసుపులేటి రాజేష్ పొలం ఎదురుగా 216 ఎన్ హెచ్ రోడ్డు ప్రక్కన పెట్టి ఉన్న మోటార్ సైకిల్ ను రాత్రిపూట దొంగలించిన కేసులో గతంలో రెండు మోటర్ సైకిల్ దొంగిలించినట్లు రూ 1 లక్ష ,40 వేలు విలువ కలిగిన రెండు మోటర్ సైకిల్ కొందామని తెలిపారు. ఈ కేసులో ముద్దాయిలైన బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం పెద పులు గువారిపాలెం గ్రామానికి చెందిన శవనం శ్రీనివాస్ రెడ్డి, అదే గ్రామానికి చెందిన వారి మురళీ కృష్ణారెడ్డి, భట్టిప్రోలు మండలం ఓలేరు గ్రామ శివారు వెంకటరాజు నగర్ గ్రామానికి చెందిన దాసరి భరత్(రవి) లను అరెస్టు చేసి నట్లు డిఎస్పి తెలిపారు. ముద్దాయిలను అరెస్టు చేసి రేపల్లె కోర్టులో హాజరు పర్సనల్ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించి మోటార్ సైకిళ్లను స్వాధీనపరచుకొని, ముద్దాయిలను అరెస్టు చేసిన భట్టిప్రోలు ఎస్ ఐ కాసుల శ్రీనివాసరావు, మరియు సిబ్బందినీ అభినందిస్తూ వారికి రివార్డు నిమిత్తం బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ కి, రివార్డు రోల్ పంపనున్నట్లు డి.ఎస్.పి తెలిపారు.