ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ కి భారీ షాక్ తగిలింది. ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్పర్సన్ అలమండ సత్యవతి, ఆమె భర్త వైసీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కౌన్సిలర్, అలమండ చలమయ్యతో పాటు పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఏలేశ్వరం పరిధిలో రాజకీయ నేపధ్యమున్న మమ్మల్ని స్థానిక వైసీపీ ఇంచార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి, తమ బంధువులు, స్థానికేతరులు మమ్ములను అణచి వేసే కార్యక్రమం చేపడుతున్నారని ఆవేదన చెందారు. వారి ఎన్నికల కంటే ఏలేస్వరం నగర పంచాయతీ పైనే పెత్తనం చలాయిస్తున్నారంటూ ఆరోపించారు..
వైసిపి అధిష్టానం ప్రత్తిపాడు ఇన్చార్జిను మార్చిన వెంటనే నగర పంచాయతీ చైర్పర్సన్ కౌన్సిలర్ గా మేమే వెళ్లి మద్దతు తెలిపి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశామనిఅన్నారు. వైసీపీ పార్టీ స్థాపించిన నాటి నుండి పార్టీ కోసం పనిచేసామని అటువంటి మమ్మల్ని స్థానికేతరులు ఏలేస్వరం నగర పంచాయతీతో పాటు నియెజకవర్గములోకూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తన్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో మరికొందరు కొన్సిల్ సభ్యులు వైసీపీ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. కొన్నిరోజులలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మీడియాకు తెలిపారు…