ఒక వ్యక్తి జీవితంలోని ప్రతి దశను కచ్చితంగా అంచనా వేసే టెక్నాలజీ(New Technology)..
పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. ఐతే మనం ఎప్పుడు చనిపోతామే మనకు తెలియదు. కానీ మనం ఎప్పుడు చనిపోతామో తెలిపే టెక్నాలజీ(Technology) వచ్చేసింది. ఒక వ్యక్తి ఎప్పుడు చనిపోతాడో కూడా తెలుసుకునేందుకు కృత్రిమ మేధస్సు (AI), మిలియన్ల మంది ప్రజల డేటా సహాయంతో డానిష్ పరిశోధకులు ఒక అల్గారిథమ్‌ను రూపొందించారు. ఇది ఒక వ్యక్తి జీవితంలోని ప్రతి దశను ఖచ్చితంగా అంచనా వేస్తుంది. ఈ అల్గారిథమ్‌ను లైవ్ 2 వేక్ అని పిలుస్తున్నారు. లోతైన అధ్యయనం ద్వారా ప్రజల ఆరోగ్యం, సామాజిక జీవిత సంఘటనలతో పాటు మరణాన్ని ఇది అంచనా వస్తుంది. మానవ జీవితాన్ని అంచనా వేయడానికి ఇది చాలా సులభమైన ఫ్రేమ్‌వర్క్ అని పరిశోధకులు అంటున్నారు. ఈ అధ్యయన ఫలితాలు నేచర్ కంప్యూటేషనల్ సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.
మనిషి మరణాన్ని మాత్రమే కాదు అనారోగ్య సమస్యలు కూడా తెలుసుకోవచ్చు ఈ టెక్నాలజీతో..
లైవ్ 2 వేక్..మనిషి మరణాన్ని మాత్రమే కాదు ఏయే అనారోగ్య సమస్యలు వస్తాయో కూడా చెబుతుందట. అంటే సంతానోత్పత్తి, ఊబకాయం, కేన్సర్ వచ్చే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయో అంచనా వేయగలదు. అంతేకాదు ఒక వ్యక్తి ఎక్కువ డబ్బు సంపాదించగలడో లేదో కూడా చెప్పగలదట. ఈ అల్గారిథమ్ అచ్చం చాట్ జిటిపిని పోలిన ప్రక్రియను ఉపయోగిస్తుంది. మనం పుట్టిన తేదీ, మనం ఏం చదువుకున్నాం, మన ఉద్యగమేంటి, మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఎలా ఉంటుంది? ఈ వివరాలు ప్రాంప్ట్ ఇస్తే చాలు మన జీవితంలో అనేక అంశాలను విశ్లేషిస్తుంది. ఎప్పుడు చనిపోతామో ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశముందో వివరిస్తుంది. కొన్ని మీడియా సంస్థలు ఈ ప్రోగ్రామ్‌కు త్వరలో డెత్ కాలిక్యులేటర్ అని పిలుస్తారు. ఐతే ఇలాంటివి ఇంటర్నెట్‌లో చాలా ఉన్నాయి. వాటిని నమ్మి మీ వ్యక్తిగత వివరాలు మాత్రం ఇవ్వొద్దు.
ఇది చదవండి: 5G డేటా వినియోగం భారతదేశంలో 4G కంటే 4 రెట్లు ఎక్కువ!
కొన్ని మోసపూరిత వెబ్ సైట్లు కృత్రిమ మేధ ద్వారా ఆయుర్దాయం చెబుతామని నమ్మించి వారి వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తున్నాయి. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతానికి లైవ్ 2వేవ్ సాఫ్ట్ వేర్ పూర్తిగా ప్రైవేట్ అని ఇది ఇంటర్నెట్‌లో అందుబాటులో లేదని పరిశోధకులు చెబుతున్నారు. లైఫ్ 2వాక్ నమూనాలో ఆరు మిలియన్ల డానిష్ ప్రజల డేటా ఉంది. ఒక వ్యక్తి జీవితంలోని సంఘటనల క్రమాన్ని అధ్యయనం చేయడం ద్వారా చివరి శ్వాస వరకు అంచనా వేస్తారట. మరణాలను అంచనా వేయడంలో ఇది 78 శాతం ఖచ్చితమైనదిగా చెబుతున్నారు. 35 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తులపై పరిశోధన చేశామని 2008 నుంచి 2016 వరకు 8 ఏళ్ల కాలంలో వారు రాబోయే నాలుగేళ్లలో చనిపోతాడో లేదో అంచనా వేశామని వెల్లడించారు. ఈ టూల్‌ను రీసెర్చ్ సెట్టింగ్ బయట ఉపయోగించేందుకు ఇంకా సిద్ధం కాలేదని పేర్కొన్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి