బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR)పై కేసు నమోదు అయింది. సీఎం రేవంత్ రెడ్డి (Revanth reddy)పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ పీఎస్‌లో కాంగ్రెస్ శ్రేణులు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కొందరు కాంట్రాక్టర్లు, బిల్డర్ల వద్ద రూ.2500 కోట్ల రూపాయలు వసూలు చేసి ఢిల్లీకి పంపించాడని కేటీఆర్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని సీరియస్ అయ్యారు. వెంటనే అదుపులోకి తీసుకొని విచారించాలని కేటీఆర్‌పై ఫిర్యాదు చేశారు.
ఇది చదవండి: నేడు కర్నూలులోకి ప్రవేశించనున్న మేము సిద్దం బస్సు యాత్ర..
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి