తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీలతోని రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మచిలీపట్నం పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి బాల సౌరి స్పష్టం చేశారు. జనసేన పార్టీ తరఫున అభ్యర్థిగా ప్రకటించిన తరువాత మొట్టమొదటిసారి ఉయ్యూరు తెలుగుదేశం పార్టీకి విచ్చేసిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి పెనమలూరు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి బోడె ప్రసాద్ తో పాటు తెలుగుదేశం, బిజెపి, జనసేన నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేక్ ను బాలశౌరి, బోడె ప్రసాదులు కట్ చేశారు. బాల సౌరిని తెదేపా నేతలు, జనసేన నేతలు పూలమాలలతో శాలవాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని నాని, మాజీ మున్సిపల్ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావు, ఉయ్యూరు టౌన్ పార్టీ అధ్యక్షుడు జంపాన గురునాధరావు,జనసేన నాయకులు చిన్న కోటయ్య, బిజెపి నాయకులు డాక్టర్ చిన్మయ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన బాలసౌరి తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీలతోని రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. కంకిపాడు నుండి గుడివాడ వరకు గ్రీన్ ఫీల్ రోడ్డు ఏర్పాటు చేస్తామని బాల సౌరి హామీ ఇచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లా వాసులకు అమరావతి రాజధానిగా ఉండటం వలన కలిగే ప్రయోజనాలు గుర్తించుకుని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం బోడి ప్రసాద్ మాట్లాడుతూ బాలశౌరి లాంటి ఎంపీ ఉంటే నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థులదే విజయమని బోడే ధీమా వ్యక్తం చేశారు.