చిత్తూరు జిల్లా కుప్పం (Kuppam) మండల పరిధిలోని దాసేగౌనూరు గ్రామ పంచాయతీలోని రామ్ నగర్ కు చెందిన చంద్రన్, దోరై పై అధికార పార్టీ సర్పంచ్ మురుగేష్, జయశంకర్ లు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో నీటి కోసం పైపు లైన్లు వేస్తుంటే, తమ పై వైసీపీ నేతలు దురుసుగా ప్రవర్తించి, తమ పై ఇనుప రాడ్డుతో తల పై కొట్టి గాయపరచాడని భాదితులు చంద్రన్, దోరై లు ఆవేదన వ్యక్తం చేశారు. మురుగేష్ వద్దనున్న నాటు తుపాకీతో కాల్చేస్తామని పలుమార్లు బెదిరించారని ఆరోపించారు. తమకు చెందిన భూములను ఆక్రమించేందుకు సర్పంచ్ మురుగేష్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతల నుండి తమకు ప్రాణహాని ఉందని. సంబంధిత అధికారులు స్పందించి మురుగేష్ వద్దనున్న నాటు తుఫాఖిని స్వాధీనం చేసుకొని, తమకు రక్షణ కల్పించాలని కోరారు.
ఇది చదవండి: పేదలకు బ్యాంకు ఖాతాలు ఉండకూడదా…
Follow us on : Google News మరిన్నితాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి