వాలంటీర్ల (Volunteers) రాజీనామా..
నంద్యాల మండలం అయ్యలురు గ్రామానికి చెందిన 27 వాలంటిర్లు (Volunteers) మూకుమ్మడిగా రాజీనామా చేశారు. పంచాయతీ కార్యదర్శికి రాజీనామా పత్రాలను అందజేచారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ టీడీపీ నాయకులు పించన్ ఇవ్వకుండా అడ్డుపడుతూ లేడీస్ ని మాయం చేస్తున్నారని మాట్లాడిన మేము బాధపడలేదు కానీ వాలంటీర్లలో ఆడపిల్లలు కూడా ఉన్నారు కదా మేము ఎందుకు అలా చేస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి నెల ఒకటవ తేదీన ఉదయమే నిద్ర లేచి అక్కా, చెల్లెమ్మలకు అవ్వ, తాతలకు పించన్ ఇచ్చే వాళ్ళమని అలాంటి మా మీద లేనిపోని నిందలు వేస్తూ ఇలా మాట్లాడటం దారుణమన్నారు. కరోనా కాలంలో ఎవరు బయటికి రాని సమయంలో కూడా ప్రజలకు సేవలందించామని తెలిపారు. చిన్న జీతమైన సొంత ఊరిలో ఉద్యోగం చేస్తూ రాజకీయాలకు అతీతంగా మేము ఎంతోమందికి సేవ చేశామని అయినా కూడా ప్రతిపక్ష నాయకులు మాపై కక్షపూరితంగా లేని పోనివి మాట్లాడం దారుణమన్నరు. మళ్ళీ జగన్ ను గెలిపించడం కోసం జగన్ చేసిన సేవలను ప్రజలకు తెలియజేస్తూ స్వచ్ఛందంగా ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు.
ఇది చదవండి : మద్యం మత్తులో విదేశీయుడి వీరంగం…
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి