సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో… రాష్ట్ర సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతాచర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి (DGP K.V. Rajendranath Reddy) తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, కేంద్ర సాయుధ బలగాల అధిపతులతో ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులను కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ దృశ్యమాధ్యమ సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ సరిహద్దు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి మావోయిస్టుల సమస్య ఉండే 91 పోలింగ్ కేంద్రాలను గుర్తించి భద్రతను కట్టుదిటం చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల మహారాష్ట్రకు పంపిన 10 కంపెనీల పోలీసు బలగాలను తిప్పి పంపడమేగాక అదనపు బలగాలను పంపాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.
ఇది చదవండి: ఈనెల 12న ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల….
Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి