కాంగ్రెస్ మేనిఫెస్టో(Congress Manifesto)పై విరుచుకుపడ్డారు ప్రధాని మోడీ(Prime Minister Modi)). ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని సహరన్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభ(Public meeting)లో మోడీ పాల్గొన్నారు. ఆసభలోనే తొలిసారి కాంగ్రెస్ మేనిఫెస్టోపై స్పందించారు. భారత్ కు కావాల్సిన ఆశలు, ఆశయాలకు దూరంగా ప్రతిపక్ష పార్టీ ఉందని విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై స్వాతంత్ర్య ఉద్యమం నాటి ముస్లిం లీగ్ తో పోలి ఉందన్నారు. కొన్ని హామీల్లో వామపక్ష భావజాలం కన్పిస్తుందన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన కాంగ్రెస్ కథ కొన్ని దశాబ్దాల క్రితమే ముగిసిందని ప్రజలు అనుకుంటున్నారని మోడీ తెలిపారు.
ఇది చదవండి: ఉగ్రవాదులను హెచ్చరించిన రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఆశలు, ఆశయాలు లేని కాంగ్రెస్.. ఈ మేనిఫెస్టోతో దేశాన్ని ప్రగతిపథంలో నడిపించలేదన్నారు. జాతీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ దగ్గర ప్రణాళికలు లేవన్నారు. దేశప్రగతిపై విజన్ కూడా లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎటువంటి వివక్ష లేకుండా పనిచేస్తుందని అన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి ఒక్కరికి చేరాలనేది తమ ఆలోచన అని వివరించారు. సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసిన మరుసటి రోజే మోడీ స్పందించడం గమనార్హం. ఇకపోతే, ‘యువ న్యాయ్’, ‘నారీ న్యాయ్’, ‘కిసాన్ న్యాయ్’, ‘శ్రామిక్ న్యాయ్’, ‘హిస్సేదారి న్యాయ్’ అని.. పాంచ్ న్యాయ్ పేరుతో హస్తంపార్టీ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి