ఇటీవల మేమంతా సిద్ధం సభ(Memantha Siddham Sabha)లో సీఎం జగన్(CM Jagan) విపక్ష నేత చంద్రబాబు(Chandrababu)ను అరుంధతి సినిమాలోని పశుపతితో పోల్చడం తెలిసిందే. చంద్రబాబు పసుపతి మోసం చేయడమే చంద్రబాబు అలవాటు అంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఈ వ్యాఖ్యలను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి సీఈవో ముఖేష్ కుమార్ మీనా దృష్టికి తీసుకెళ్లారు. సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎన్నికల్ కోడ్ ఉల్లంఘన కిందికి వస్తాయని సీఈవోకు ఫిర్యాదు చేశారు.
ఇది చదవండి: చంద్రబాబుపై ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ఆగ్రహం
దీనిపై సీఈవో ముఖేశ్ కుమార్ మీనా స్పందించారు. సీఎం జగన్ కు నోటీసులు జారీ చేశారు. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘనే అని ప్రాథమిక అంచనాకు వచ్చామని మీనా తెలిపారు. సీఎం జగన్ సకాలంలో స్పందించకపోతే ఈసీ తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి