Follow us on : Facebook, Instagram, YouTube & Google News
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరైన రాష్ట్ర మంత్రి కొండా సురేఖ (Konda Surekha), ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు నియోజకవర్గ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు హాజరయ్యారు.
ఇది చదవండి: ఒకే కొమ్మకు 55 మామిడి కాయలు..
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ఎన్ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేకున్నా అధికార పార్టీలతో కొట్లాడి ఉద్యమంలో కీలకంగా ఉన్నారని తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం వాళ్ల కార్యకర్తలకు, వారి కుటుంబాలకు ,నాయకుల కోసమే పనిచేసిందని తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చినా ప్రజలకు ఒరిగిందేమిలేదన్నారు. మేడిగడ్డ మిషన్ భగీరథ మిషన్ కాకతీయ వంటి ప్రాజెక్టులు అవినీతి మయంగా జరిగాయన్నారు. రైతులకు పంటలు ఎండిపోతున్నాయంటే దానికి కారణం టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించినటువంటి కాళేశ్వరమేనని తెలిపారు. రైతుల పంటలు పండుతున్నాయంటే దానికి కారణం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన శ్రీశైలం నాగార్జునసాగర్ సాగర్ కడియం ప్రాజెక్టుల వల్లనేనని ఆమె తెలిపారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.