Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh జగన్ సమక్షంలో… వైసీపీలోకి పోతిన మహేష్..

జగన్ సమక్షంలో… వైసీపీలోకి పోతిన మహేష్..

by Prakash
Pothina Mahesh

పోతిన మహేష్ (Pothina Mahesh) :

జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేష్ (Pothina Mahesh).. వైసీపీలో చేరారు. ఇవాళ సీఎం జగన్ సమక్షంలో పోతిన మహేష్ వైసీపీ కండువా కప్పుకున్నారు. అనుచరులతో కలిసి సీఎం జగన్ క్యాంప్‌ సైట్‌ వరకు పోతిన మహేష్ ర్యాలీ నిర్వహించారు. పల్నాడు జిల్లా గంటావారిపాలెంలో జగన్‌ క్యాంప్‌ సైట్‌కి ర్యాలీగా వెళ్లి.. జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

ఇది చదవండి : రసవత్తరంగా మారిన నరసాపురం రాజకీయం…

సింహంలా సింగిల్‌గా వచ్చే దమ్మున్న నాయకుడితోనే తన పయనం ఉంటుందన్నారు పోతిన. జెండాకూలీలా బతకడం తన వల్ల కాదని.. వేరే పార్టీల జెండా మోసే నాయకుడితో ఉండలేనన్నారు. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడితో కలిసి పనిచేస్తానని పోతిన మహేష్ ప్రకటించారు. అలాగే రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి కూడా జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

019172
Total views : 90055

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.