Thursday, March 12, 2026
News Navigation

Breaking

Thursday, March 12, 2026
Home Latest News మరో రెండు రోజుల్లో ఇంటర్ ఫలితాలు..

మరో రెండు రోజుల్లో ఇంటర్ ఫలితాలు..

by Prakash
Inter results in two days

విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఫలితాలను 12న విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్‌ విద్యా మండలి అధికారులు వెల్లడించారు. జవాబు పత్రాల మూల్యాంకనం, పేపర్ల స్కానింగ్‌కు సంబంధించిన ప్రక్రియ ఆదివారంతో ముగిసిందని తెలిపారు.. అయితే, పేపర్ రీ వ్యాల్యుయేషన్ మరోసారి చేస్తున్నామన్నారు. ఆ ప్రక్రియ కూడా దాదాపు పూర్తికావొచ్చిందన్నారు. ఏపీలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు మార్చి 1న ప్రారంభమై 20 వరకు కొనసాగాయి. ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు.

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.