టీడీపీ చీఫ్ చంద్రబాబు(Chandrababu)పై సీఎం జగన్(CM Jagan) ఫైర్ అయ్యారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సభలో జగన్ మాట్లాడుతూ.. జిత్తులమారి చంద్రబాబు కుట్రలను తిప్పుకొట్టాలని పిలుపునిచ్చారు. దుష్టకూటమి నుండి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు సిద్ధమా అని ప్రజలను ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు గంగలా ఉంటారు. అధికారం వచ్చిన తర్వాత చంద్రముఖిలా మారుతారని ఎద్దేవా చేశారు.
ఇది చదవండి: వైసీపీలో చేరిన పోతిన మహేష్..!
టీడీపీ కూటమి పవర్లోకి వస్తే లకలక అంటూ పేదల రక్తం తాగుతారని విమర్శించారు. 30 ఏళ్లుగా కుట్ర, అబద్ధపు రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు గాడిదను తీసుకొచ్చి గుర్రం అని ఊదరగొడతారని సెటైర్ వేశారు. జాబు రావాలంటే బాబు రావాలని భ్రమ కల్పిస్తున్నారని టీడీపీపై నిప్పులు చెరిగారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ఆగిపోతాయని హెచ్చరించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి