మేమంతా సిద్ధం (Memantha Siddham) :
ఏపీలో మేమంతా సిద్ధం (Memantha Siddham) పేరుతో ఎన్నికల ప్రచార యాత్ర చేస్తున్న తనపై విజయవాడలో జరిగిన రాయి దాడిపై సీఎం జగన్ తొలిసారి స్పందించారు. ఇవాళ ఉదయం కేసరపల్లి క్యాంపు సైట్ లో తనను కలిసేందుకు వచ్చిన వైసీపీ నేతలతో జగన్ మాట్లాడారు. బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసే దాడులు చేస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. ప్రజల ఆశీర్వాదం వల్లే ప్రాణాపాయం తప్పిందన్నారు. మరోసారి అధికారంలోకి వస్తున్నామని, ఎలాంటి ఆందోళన వద్దని పార్టీ నేతలకు సీఎం జగన్ సూచించారు. ఎలాంటి దాడులు తనను ఆపలేవని, ధైర్యంతో ముందడుగు వేద్దామని నేతలతో అన్నారు. దేవుడు దయ, ప్రజల ఆశీర్వాదం తనతో ఉన్నాయని నాయకులతో జగన్ అన్నారు. ధైర్యంగా అడుగులు ముందుకేద్దామన్నారు. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరంలేదున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
గుడివాడ బహిరంగ సభలో పాల్గొన్న జగన్..
మరోవైపు ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్ర ప్రారంభమైంది. కేసరపల్లి దగ్గర నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదుగా జొన్నపాడు వద్దకు బస్సు యాత్ర చేసుకుంటుంది. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం జొన్నపాడు, జనార్దనపురం మీదుగా సాయంత్రం 3.30 గంటలకు గుడివాడ నియోజకవర్గంలోకి బస్సు యాత్ర చేరుకుంటుంది. గుడివాడలో బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రి 8గంటల సమయానికి కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ నుండి ఏలూరు జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశిస్తుంది. బొమ్మలూరు, కలపర్రు, ఏలూరు బైపాస్ మీదుగా దెందులూరు, గుండుగొలను, భీమడోలు, కైకరం, నారాయణపురం వరకు బస్సు యాత్ర కొనసాగనుంది.
ఏపీ సీఎం జగన్‌పై దాడి కేసులో విచారణ..
మరోవైపు ఏపీ సీఎం జగన్‌పై దాడి కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే ఆరు బృందాలను ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులు వివిధ కోణాల్లో విచారణ చేపడుతున్నారు. తాజాగా మరో 16 టీమ్‌లను ఏర్పాటు చేసి బెజవాడ పోలీసులు విచారిస్తున్నారు. ఒక్కొక్క టీమ్‌లో డీసీపీ, ఏడీసీపీ, డీఎస్పీ ర్యాంక్ అధికారులను బెజవాడ సీపీ నియమించారు. ఒక్కో టీమ్‌కు ఐదుగురు సభ్యులతో కూడిన ఒక్కో టీమ్ సిటీలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులను విచారిస్తోంది. ఇప్పటికే పోలీసులు ఈ కేసులో అనుమానితులుగా ఉన్న నలుగురు వ్యక్తులను విచారించారు. కాగా జగన్‌పై దాడి కేసును డీజీపీ, ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాయి.
ఇది చదవండి : ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటన..
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: తనపై జరిగిన దాడిపై స్పందించిన సీఎం జగన్…