గుంటూరు పొగాకు నోట్లో ఉంటె ఏమి గూట్లో ఉంటె ఏమి సామెత లాగా, ఎంపి గా మిథున్ రెడ్డి ఉంటె ఏమి లేకుంటే ఏమి అని భావించుకునే స్థితికి ప్రజలు వచ్చారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాయచోటి ఎన్నికల అసెంబ్లీ ఇంచార్జి నాగోతు రమేష్ నాయుడు (Nagothu Ramesh Naidu) విమర్శించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి లో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో భాజపా జిల్లా అధికార మీడియా ప్రతినిధి పాలగిరి శ్రీనివాస రాజు, సీనియర్ నాయకులూ అరమాటి శివగంగి రెడ్డి, అసెంబ్లీ కన్వినర్ తో పాటు అసెంబ్లీ భాజపా నాయకులు శ్రేణులు తో కలిసి వారు పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో వైసిపి ప్రభుత్వం పై ద్వజమెత్తిన నాగోతు రమేష్ నాయుడు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు జగన్ మోహన్ రెడ్డి అధికారంలో కి వచ్చిన ఆరు నెలల్లోనే గాలేరు నగిరి, హంద్రీ నీవా ప్రాజెక్ట్ లతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్ట్ లు పూర్తి చేస్తామన్న సిఎం జగన్ మోహన్ రెడ్డి తెగిపోయిన అన్నమయ్య, పించా జలాశయాల పునరుద్దరించే దిశగా అడుగులే వేయలేదని ఆరోపించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ ప్రాంతాన్ని హార్టికల్చలర్ హబ్ గా చేసి ధరల స్థిర కరణ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు ఇప్పటికి చేయలేదన్నారు. రాయలసీమలో పరిశ్రమలకు మానవ వనరులకు భూములు అనుకూలంగా ఉన్నప్పటికీ పరిశ్రమలను ఏర్పాటు చేయడంలో జగన్ ప్రబుత్వం విపలం అయ్యిందన్నారు. ఓ ప్రజాప్రతినిధిగా, సొంత జిల్లా నుండి సిఎం గా ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రాంత ప్రజలను పూర్తిగా నిర్లక్ష్యం చేసారని ద్వజమేత్తారు. నెంబర్ 2 అనే చెప్పుకునే ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లోక్ సభ ప్యానెల్ స్పీకరగా పని చేస్తున్న ఆయనకు డిల్లీలో పెద్ద లాబింగే ఉన్నప్పటికీ లిక్కర్ వ్యాపారానికో, తన పరిశ్రమలను పెంపొందించుకోవాడానికో, కాంట్రాక్టర్లు కోట్లకు పెంచుకునేందుకు ఉపయోగించుకున్నారే తప్ప ప్రజలకు తను ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు.
రెండు సార్లు అత్యదికమైనటువంటి మేజార్టీతో రాజంపేట పార్లమెంట్ నుంచి గెలిచినా నవయువకుడు, ఇదే ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి కుడా నవయువకుడే కాని ఈ ఇద్దరు కుడా ఈ ప్రాంతానికి రు ఏమి చేశారు అనే దానికి బహిరంగంగా చర్చకు సిద్దమా అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముడన్నర ఏండ్లుగా ఉన్న కాలంలో జరిగిన అభివృద్దిని.. ఈ ఇదేండ్లలో మీరు సొంతంగా ఎందుకు అభివృద్ధి చేయల పొయ్యారని విమర్శించారు. కిరణ్ కుమార్ రెడ్డి హయంలో జరిగిన్ అభివృద్ధికి మీరు చేసిన అభివృద్దికి మీరు చర్చకు వచ్చిన మేము సిద్దమేనని హెచ్చరించారు.ప్రజాప్రతినిధులు గెలిచినా తరువాత ప్రజలకు మొండి చేయి చూపించారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కుల మత, పార్టీలకతీతంగా, కూటమి భారతీయ జనతా పార్టీ తరపున రాజంపేట పార్లమెంట అభ్యర్ధిని కిరణ్ కుమార్ రెడ్డి ని గెలిపించు కునేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. కేంద్రంలో నరేద్ర మోడీ రాక తద్యం.. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు సత్యం… ఈ ప్రాంతంలో నూటికి నూరు శాతం అభివృద్ధి జరిగి తీరుందన్న ధీమాను వ్యక్తం చేశారు.
కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడ పర్యటించిన అద్బుతమైన స్పందన ఉందన్నారు. అయోధ్యలో ఎవిధమినటువంటి చిన్న పాటి ఘర్షణలు లేకుండా ఈ దేశంలో నున్నటువంటి అందరి మతాల సహకారం తీసుకోని ఆలయం ను నిర్మింప జేయడమే కాకుండా అన్ని మతాల వాళ్ళను కుడా ఉత్సవాలలో పాల్గొనే విధంగా ఏర్పాటు చేసిన ప్రధాని మోడిని నిర్ణయం పట్ల ప్రతి ఒక్కరు హర్షిస్తున్నారని కొమియాడారు. రాబోవు ఎన్నికలల్లో నరేంద్ర మోడీ గారి పట్ల సానుకూలత ,డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో మరింత వేగం పెరుగుతుందని ఆశభావన్ని వ్యక్తం చేశారు. కృత్రిమంగా రాయచోటి, కోడూరు, రాజంపేట కరువు విలయతాండవం చేయడానికి ఇసుక మాఫియానే కారణం కాదా అని వారు ప్రశ్నించారు. ఎట్లో ఇసుకను ఇష్టం వచ్చినట్లు ఇతర రాష్ట్రానికి టిప్పర్ ను 2,40,౦౦౦ రూపాయలకు తరలిచ్చి బ్లాక్ లో అమ్ముకోవడం కారణంగా భూమిలో నిటి శతం తగ్గిపొయ్యి బోర్లలో వెయ్యి అడుగులు వేసిన నీరు పడిన దుస్థితికి వైసిపి ప్రజాప్రతినిధులు తీసుకువచ్చారని వారు ద్వజమెత్తారు. వీటన్నింటికి కుడా ఓటు తోనే బుద్ది చెప్పాలని ప్రజలు నిశ్చయించుకున్నట్లు వారు తెలియజేశారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటం
- మాజీ MLA వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి