ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధి పై ఇంకా ఉత్కంఠ వీడలేదు. ఎంపీ అభ్యర్థులు గా కొత్త వ్యక్తుల పేర్లు వినిపిస్తుండటం తో కాంగ్రెస్ కార్యకర్తల్లో అసహనం వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడం కోసం కష్ట పడిన వారిని కాదని అసలు ఏ పార్టీయో తెలియని వ్యక్తుల పేర్లు ఖమ్మం ఎంపీ అభ్యర్థులు గా వినిపిస్తుండటంతో కాంగ్రెస్ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గా గత ఎంపీ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు గెలుపు కు కృషి చేసిన వ్యక్తి పేరుతో పాటు అసలు రాజాకీయాలకు దూరంగా ఉన్న మరో వ్యక్తి పేరు వినిపిస్తుంది. దీంతో కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఇంతకాలం ఉన్న నాయకులు ఏం చేయాలని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడే వారు లేరా అనేది ప్రశ్నార్థకంగా మారింది. పార్టీ అధికారంలో లేకపోయినా కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడిన నాయకులు జిల్లాలో ఉన్నారు. వారందరినీ కాదనీ కొత్త వ్యక్తులకు ఎంపీ టిక్కెట్ కేటాయిస్తున్నారనే దానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ అధిష్టానం ఇప్పటికైనా పునరాలోచించి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేసిన వారికి ఖమ్మం పార్లమెంట్ టిక్కెట్ కేటాయించాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. అసలు పార్టీలో లేని వారికి, గత ఎన్నికల్లో BRS అభ్యర్థి గెలుపుకు కృషి చేసిన వారికి టిక్కెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గా చూస్తూ ఊరుకోమని వారు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి