ఏలూరు జిల్లా(Eluru District) పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం కూటమి జనసేన అభ్యర్థి(JanaSena Candidate) చిర్రి బాలరాజు(Chirri Balaraju) నామినేషన్(Nomination) వేసారు. ఈ కార్యక్రమంలో ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్(Putta Mahesh Yadav) ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జంగారెడ్డిగూడెం నుండి భారీ ఎత్తున కార్లు, ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహిస్తూ.. బుట్టాయిగూడెం మండలం కోట రామ చంద్రపురం ఐటీడీఏకు చేరుకున్నారు. అనంతరం ఎన్నికల ప్రత్యేక అధికారి, ఐటీడీఏ పీవో సూర్య తేజకి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అనంతరం పుట్టా మహేష్ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రాజెక్టు నిర్వాసిత సమస్యలని గాలికి వదిలేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళతామన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేతపల్నాడు జిల్లాలో కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాలా బజారులో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కరెంటు బిల్లు కట్టలేదనే సాకుతో మూసీవేశారు.గత వైసీపీ హయాంలో సుమారు…
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.…
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.