ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అప్డేట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావుకు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. హైదరాబాద్ నాంపల్లి కోర్టు వీళ్లిద్దరికీ నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైన ఈ ఇద్దరు నిందితులు ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటున్నారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ఇలినోయీలో ఉన్నట్లు అనుమానిస్తుండగా.. ఓ ఛానెల్ ఎండీ శ్రవణ్‌రావు.. మియామీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ ఇద్దరు నిందితులను అరెస్టు చేయడానికి వీలుగా అనుమతులు ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టులో తెలంగాణ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. సీఆర్పీసీ 73 సెక్షన్ కింద అనుమతించాలంటూ పోలీసులు విన్నవించారు. దీనిపై దర్యాప్తు అధికారుల విజ్ఞప్తికి న్యాయస్థానం సమ్మతించింది.
ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు నలుగురు పోలీసులను దర్యాప్తు అధికారులు అరెస్ట్ చేశారు. తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో గుర్తించారు. అయితే, తమపై కేసు నమోదు కాగానే ప్రభాకర్‌రావు విదేశాలకు వెళ్లిపోయారు.
అయితే, ఇప్పటికే ఈ ఇద్దరికోసం పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీచేశారు. అయితే, రెడ్ కార్నర్ నోటీసులకోసం కోర్టు అనుమతి తప్పనిసరి కావడంతో.. సీఆర్పీసీ 73ద్వారా పోలీసులు అనుమతి తీసుకున్నారు. ఇప్పుడు కోర్టు వారెంట్ ఇష్యూ చేయడంతో.. తెలంగాణ పోలీసులు.. ఇంటర్‌పోల్‌ను సంప్రదించనున్నారు.
మరోవైపు.. దర్యాప్తు అధికారులు.. అమెరికాలో ట్యాపింగ్ కేసు నిందితుల ఆచూకీని గుర్తించారు. వాళ్లను స్వదేశానికి రప్పించేందుకు రెడ్‌కార్నర్ నోటీసులు జారీచేయబోతున్నారు. వాస్తవానికి మార్చి 10వ తేదీన ఫోన్ ట్యాపింగ్ కేసు ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ఏప్రిల్ 29వ తేదీన నిందితుల జాబితాలో ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావును చేర్చారు దర్యాప్తు అధికారులు. అయితే, అప్పటికే ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు ఇద్దరూ విదేశాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు వాళ్లను తిరిగి భారత్‌కు రప్పించి విచారిస్తేనే ఫోన్ ట్యాపింగ్ కేసులో పొలిటికల్ లింకులు బయటపడే అవకాశం ఉందంటున్నారు.
ప్రస్తుతం ప్రభాకర్‌రావు అమెరికాలోని ఇలినోయీలో.. శ్రవణ్‌రావు మియామీలో ఉన్నట్లు తెలియడంతో వారిని తమకు అప్పగించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరే పనిలో తెలంగాణ పోలీసులు నిమగ్నమయ్యారు. రెడ్‌కార్నర్ నోటీసు జారీ కావాలంటే ప్రత్యేక కార్యాచరణ ఉంటుంది. దర్యాప్తు సంస్థ తాము నమోదు చేసిన కేసులోని నిందితులు విదేశాల్లో ఉన్నట్లు ధ్రువీకరించుకున్న తర్వాత సీబీఐని సంప్రదించాలి. అయితే తెలంగాణలో ఒక్క సీఐడీ మినహా ఇతర దర్యాప్తు సంస్థలు నేరుగా సీబీఐని సంప్రదించే అవకాశం లేదు. దీంతో ఇక్కడి దర్యాప్తు సంస్థలు నిందితులను విచారించాల్సిన అంశాన్ని విశదీకరిస్తూ సీఐడీకి సమాచారం ఇస్తారు. అప్పుడు సీఐడీ ఆ వివరాలతో సీబీఐకి లేఖ రాస్తుంది. అనంతరం సీబీఐ వర్గాలు ఫ్రాన్స్ దేశం లియోన్‌లోని ఇంటర్‌పోల్‌ను సంప్రదిస్తాయి. అక్కడి అధికారులు నిందితులను విచారించాల్సిన ఆవశ్యకత ఉందని భావిస్తే రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేస్తారు. అది ఇంటర్‌పోల్ పరిధిలోని 196 సభ్యదేశాలకు, వాటిల్లోని అన్ని విమానాశ్రయాలకు జారీ అవుతుంది. సదరు నిందితులు ఏ దేశంలో ఉంటే ఆ దేశ దర్యాప్తు సంస్థలు వారిని సొంత దేశానికి తిరిగి పంపిస్తాయి. ప్రస్తుతం ట్యాపింగ్ కేసులోని నిందితులు అమెరికాలో ఉన్నట్లు తేలడంతో అక్కడి యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వారిని భారత్‌కు పంపించొచ్చు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…