చిత్తూరు జిల్లా పుంగనూరు లో వరకట్నం వేధింపులు తాళ లేక భర్త పై భార్య ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని ఏఆర్ కానిస్టేబుల్ భార్య విజయ కుమారి (28) ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం తనకు న్యాయం చేయాలని అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన చేపట్టింది. చౌడేపల్లి సర్కిల్లో గల సదుం పోలీస్ స్టేషన్లో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న టి. గిరిబాబు కు 2017 సంవత్సరంలో తనతో వివాహం జరిగిందని విజయ కుమారి తన దగ్గర ఉన్న మ్యారేజ్ సర్టిఫికెట్ ను చూపించింది. గిరిబాబు ఈ మధ్యనే అన్లైన్లో లక్షల రూపాయల డబ్బును పోగొట్టుకోన్నట్లు, దాని కారణంతోనే తనను పుట్టింట నుండి వరకట్నం తేవాలని వేధింపులకు గురి చేస్తున్నాడని విజయ కుమారి ఆరోపించింది. డబ్బుకోసం ఇంకో యువతిని వివాహం చేసుకోవటానికి సిద్దపడ్డాడని, రెండు రోజుల క్రితం సదుంలోని ఓ గుడిలో రెండో వివాహం చేసుకున్నాడని ఆవిడ ఆరోపించింది. ఈ ఘటన పై పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసారు.
వరకట్న వేధింపులకు గురి చేస్తున్న కానిస్టేబుల్…
121
previous post