డా.బి.ఆర్.అంభేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలంలో ఇంకా ముంపు లోనే ఉన్న వరిచేలు, ఎనిమిది రోజులుగా ముంపులో ఉండటంతో చేలల్లోనే మొలకెత్తిన పంట. ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామంలో ఇంకా ముంపులోనే ఉన్న వరిచేలను పరిశీలించిన అధికార జనసేన పార్టీ ఇన్చార్జి పితాని బాలకృష్ణ. రాజమండ్రి నాళంవారి సత్రం భూములను కౌలుకు తీసుకుని సాగు చేసామని ముంపుతో పంట పూర్తిగా దెబ్బతిని కౌలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామని, అధికారులుగాని, అధికార పార్టీ నాయకులు గాని కనీసం వచ్చి రైతులను పలకరించిన వాళ్లు లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి షరతులు లేకుండా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని, ఎకరాకు రూ.25 వేలు పరిహరం అందించాలని బాలకృష్ణ డిమాండ్ చేసారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రైతుల బాధలు తెలియవని, సొల్లు కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతున్నారని విమర్శించారు. టిడిపి, జనసేనపార్టీ లు అధికారంలోకి వచ్చాక రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
చేలల్లోనే మొలకెత్తిన పంట….
64
previous post