జనసేన పార్టీలో పొకల మల్లికార్జున్ చేరికతో తిరుపతి జనసేనలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ సాయంత్రం తిరుపతిలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలవాలను వేసి నివాళులు అర్పించి అక్కడి నుంచి నాలుగు కాళ్ల మండపం వరకు పోకల మల్లికార్జున్ తన అనుచరులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలో జనసేన అభ్యర్థి ఆరని శ్రీనివాసులు కు మద్దతు ఇచ్చి అత్యధిక మెజారిటీతో జనసేన అభ్యర్థిని గెలిపించుకోవాలని అలాగే తిరుపతిని జనసేన కంచుకోటగా మార్చు కోవాలని పిలుపునిచ్చారు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, జనసేన బిజెపి టిడిపి కూటమి లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణ ఆంధ్ర ప్రదేశ్ గా మార్చే సత్తా చంద్రబాబు నాయుడుకి ఉందని కావున కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని జనసేన నాయకులు పోకల మల్లికార్జున్ పిలుపునిచ్చారు.
పొకల మల్లికార్జున ఆధ్వర్యంలో భారీ ర్యాలీ..
72
previous post