89
గంజాయి మొక్క పెంచుతున్న వ్యక్తిని చందనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. లింగంపల్లి గోపినగర్ లో నివాసం ఉంటున్న ఆనంద్ అనే వ్యక్తి ఇంట్లో గంజాయి మొక్క పెంచుతున్నాడు. విశ్వనీయ సమాచారం అందడంతో ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పోలీసుల తనిఖీలో ఐదు అడుగుల ఐదు అంగుళాల ఎత్తు 600 గ్రాముల గంజాయి మొక్కను గుర్తించారు. పోలీసులు మొక్కను స్వాధీనం చేసుకొని ఆనంద్ పై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.
మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.