అతివేగం యువకుని ప్రాణాలను బలిగొంది. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఎస్సై మాహేశ్వర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సంకెపల్లి గూడ గ్రామానికి చెందిన మల్లే రాఘవేందర్ గౌడ్(21) గురువారం రాత్రి 11 గంటల సమయంలో నాగరగూడా నుండి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. మార్గమధ్యంలో గ్రామ సమీపంలోని భారత్ గ్యాస్ గోదాం వద్ద బైక్ అతివేగం గా నడపటం వల్లన అదుపుతప్పి డివైడర్ ను ఢీకొంది. ప్రమాదంలో ఛాతీ భాగంపై బలమైన గాయాలు తగలడం వల్లన ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే షాద్నగర్ లోని ఏబీపీ హాస్పిటల్ కి తరలించగా అక్కడ వారు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోవాల్సిందిగా కోరారు. షాద్నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందినట్లు ప్రభుత్వ డాక్టర్లు తెలిపారు. యువకుడు చనిపోవడానికి కారణం ఛాతీ పైన బలంగా డివైడర్ తగలడం తో చనిపోయినట్లు తెలుస్తోంది. తండ్రి శ్రీశైలం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడి ప్రాణాలు బలిగొన్న రోడ్డు ప్రమాదం
77