పుట్టపర్తి నియోజకవర్గం ఓడి చెరువు మండల పరిధిలోని తూవంకపల్లి గ్రామానికి చెందిన పాలిమినేని నంజప్ప నాయుడు (50) అడవి పందుల కేసిన ఉచ్చులో చిక్కుకొని తీవ్ర విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడు. ఏఎస్ఐ కిషోర్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు గత రాత్రి తూవంకపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో స్వయంగా అతనే అడవి పందులు పట్టుకోడానికి.. పెద్ద లైను అయిన 11/33.. విద్యుత్తు లైనులకు తాను తయారు చేసుకున్న, ఉచ్చు తీగలను అమర్చాడు. ఉదయం ఏవైనా అడవి పందులు ఉచ్చులో చిక్కుకున్నాయని పరిశీలించాడానికి వెళ్లిన సమయంలో సదరు గొర్రెల కాపరి నంజపునాయుడే ఆ ఉచ్చులో చిక్కుకొని తీవ్ర విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. గొర్రెల కాపరి నంజప్పకు భార్య, కుమార్తె, కుమారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గ్రామస్తుల సమక్షంలో శవ పంచనామా నిర్వహించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
విద్యుత్ తీగల ఉచ్చులో చిక్కుకొని గొర్రెల కాపరి మృతి..
86
previous post