కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విషాదం చోటుచేసుకుంది. సున్నం బట్టి వీధిలో నూతనంగా నిర్మిస్తున్న ఓ ఇంటి పైకి వెళ్ళిన రోషన్ కు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాడు. మృతుడు వంట మాస్టర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు. అయితే రోషన్ ఎక్కువగా మద్యం సేవిస్తూ ఉంటాడని ఇప్పుడు కూడా మద్యం మత్తులో ఇంటి పైకి వెళ్ళిన రోషన్ కాలు జారీ విద్యుత్ తీగలు మీద పడటంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ గురై మృతి చెందాడని స్థానికులు తెలిపారు. అయితే మృతుడు రోషన్ మెడ పై పెద్ద గాయం ఉండటంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
Electrical shock
పుట్టపర్తి నియోజకవర్గం ఓడి చెరువు మండల పరిధిలోని తూవంకపల్లి గ్రామానికి చెందిన పాలిమినేని నంజప్ప నాయుడు (50) అడవి పందుల కేసిన ఉచ్చులో చిక్కుకొని తీవ్ర విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడు. ఏఎస్ఐ కిషోర్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు గత రాత్రి తూవంకపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో స్వయంగా అతనే అడవి పందులు పట్టుకోడానికి.. పెద్ద లైను అయిన 11/33.. విద్యుత్తు లైనులకు తాను తయారు చేసుకున్న, ఉచ్చు తీగలను అమర్చాడు. ఉదయం ఏవైనా అడవి పందులు ఉచ్చులో చిక్కుకున్నాయని పరిశీలించాడానికి వెళ్లిన సమయంలో సదరు గొర్రెల కాపరి నంజపునాయుడే ఆ ఉచ్చులో చిక్కుకొని తీవ్ర విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. గొర్రెల కాపరి నంజప్పకు భార్య, కుమార్తె, కుమారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గ్రామస్తుల సమక్షంలో శవ పంచనామా నిర్వహించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలం సంజీవరాయుని పేట లో విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందాడు. మృతుడు బురుజుపల్లె గ్రామస్తుడు ప్రయివేటు ఎలెక్ట్రీషన్ అని సమాచారం. LC తీసుకోవడంలో పొరపాటు జరిగి ప్రమాదం జరిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
Read Also..





Total views : 75430