రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో జెడ్పీటీసీ, మాజీ జడ్పీటిసి, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు సహా సర్పంచ్ లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. గతంలో ఈ ప్రాంత నాయకుడు నియోజకవర్గానికి వస్తే కాంగ్రెస్ వారిని ముందస్తు అరెస్ట్ ల పేరిట నిర్బంధించారు. కాని మా ప్రభుత్వం స్వేచ్ఛ గా సమస్యలు విన్నవించుకునే అవకాశం కల్పిస్తోందని మంత్రి పొన్నం అన్నారు. కేటీఆర్ ను అడ్డుకున్నారని పెట్టిన కేసులను ప్రభుత్వంతో మాట్లాడి, తొలగిస్తాం. కేటీఆర్ అసమర్థత వల్లనే తొమ్మిదవ ప్యాకేజీ పనులు నిలిచి పోయాయి. వాటిని త్వరితగతిన పూర్తి చేస్తాం. నేరుగా ఎమ్మెల్యే అయి, కేసీఆర్ పుత్రునిగా మంత్రి అయి మంత్రి పదవి పోగానే కేటీఆర్ కు మనసున పడతలేదని పొన్నం విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తప్ప దేశానికి, రాష్ట్రానికి ప్రజాస్వామ్య బద్దంగా పాలించే పార్టీ లేదు. గతంలో ప్రజా సమస్యలపై ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు మంత్రిగా వచ్చాను. ముఖ్యమంత్రి నుంచి అప్పర్ మానేరు అభివృద్ధి పనుల విషయంపై హామీ తీసుకున్నామని మంత్రి పొన్నం తెలిపారు.
బీఆర్ఎస్ కు దిమ్మతిరిగే షాక్.. పొన్నం ప్రభాకర్
56
previous post