115
నిర్మల్ జిల్లా బాసర త్రిబుల్ ఐటీ(Basara IIIT) లో పియుసి మొదటి సంవత్సరం చదువుతున్న సంగారెడ్డి జిల్లా గ్రామానికి చెందిన తెనుగు శిరీష(18) గురువారం రాత్రి హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని కళాశాల సిబ్బంది తెలిపారు. చదువుల తల్లి క్షేత్రంలో నెలకొన్న బాసర త్రిబుల్ ఐటీ లో ఎప్పుడు ఏదో ఒక కారణం వల్ల విద్యార్థుల బలవన్మరణాలు మాత్రం ఆగడం లేదు ప్రస్తుతం ఆత్మహత్య చేసుకున్న శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Follow us on :Facebook, Instagram&YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.