Sunday, March 15, 2026
News Navigation

Breaking

Sunday, March 15, 2026
Home Andhra Pradesh అంబేద్కర్ కోనసీమ జిల్లా లో క్షుద్ర పూజలు కలకలం

అంబేద్కర్ కోనసీమ జిల్లా లో క్షుద్ర పూజలు కలకలం

by Satya
అంబేద్కర్ కోనసీమ జిల్లా లో క్షుద్ర పూజలు కలకలం

అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం, కుండలేశ్వరంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. కాట్రేనికోన మండలం కుండలేశ్వరం నక్క వారి పేట లోని ఓ ఇంట్లో క్షుద్ర పూజలు చేస్తున్నారన్నపుకారు షికార్లు చేస్తోంది. దాంతో స్థానికులు ఈ విషయంతెలిసి బెంబేలె త్తి పోతున్నారు. సమాచారంతో హడలిపోతున్న గ్రామస్తులు…సుమారు నెల రోజుల నుండి గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ప్రతిరోజూ అర్ధరాత్రి వేళలో కుండలేశ్వరం స్నాన ఘట్టం వద్దకు వచ్చి స్మశానంలో పూజలు నిర్వహించడం చూసామని గ్రామస్థులు చెబుతున్నారు. అర్ధరాత్రి వేళలో పసుపు రాసుకుని దిగంబరంగా పూజలు చేస్తున్నారనే పుకార్లు చెక్కెర్లు కొడుతున్నాయి. దాంతో ప్రజలు భయం గుప్పెట్లో గజగజ వణికి పోతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా లో క్షుద్ర పూజలు కలకలం ఆ నోట ఈ నోట గ్రామమంతా పాకడం తో ఆ ఇంటి ముందు నుంచి వెళ్లడం మానేసారు. ఇక ఈ విషయం పోలీసులకు చేరడంతో.. అకాస్మిక దాడుల నిర్వహించారు. దాంతో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Follow us on : Facebook, Instagram, YouTube & Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.