తెలంగాణలో జూనియర్ డాక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. జూడాల సమస్యల పరిష్కారంతో పాటు వారి డిమాండ్లు నెరవేర్చడంపై మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. దాంతో జూడాలు సమ్మె విరమించారు. ఇవ్వడంతో జూడాలు సమ్మె విరమణకు అంగీకరించారు. జూనియర్ డాక్టర్లు మొత్తం ఎనిమిది డిమాండ్లు ప్రభుత్వం ముందుంచగా.. ప్రస్తుతం 6 డిమాండ్లు పరిష్కారానికి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సానుకూలత వ్యక్తం చేయడంతో జూడాలు వెనక్కి తగ్గారు.
నిధుల విడుదలకు జీవోలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం ఉస్మానియా, గాంధీ హాస్పిటల్, కాకతీయ మెడికల్ కాలేజీలలో వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే నిర్ణయం తీసుకుంది. జూడాలతో చర్చలు జరిపిన తరువాత గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్స్ జూనియర్ డాక్టర్ల వసతిగృహాల నిర్మాణానికి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దాంతోపాటు వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీలో రహదారుల పునరుద్ధరణ కోసం నిధుల ఇచ్చేందుకు 204.85 కోట్లు కేటాయిస్తూ జీవో ఇచ్చింది. ఉస్మానియా, గాంధీలో ఆస్పత్రిలో హాస్టల్స్ నిర్మాణానికి 121.90 కోట్లు, 79.50 కోట్లు.. కాకతీయ యూనివర్సిటీలో రోడ్ల కోసం 2.75 కోట్ల మేర తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేయడం తెలిసిందే. దీంతో మొదట జూనియర్ డాక్టర్లు తాత్కాలికంగా సమ్మె విరమణకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం రెండు జీవోలు జారీ చేసింది. ఇతర డిమాండ్లు పరిష్కరించేందుకు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇవ్వడంతో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- 17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్‌సీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్,…
- నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు NTAలను ఆదేశించింది సుప్రీంకోర్టు. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన…
- నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…
- సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచిత్ర ఘటన.సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఓ విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా నేరస్తులు, ఖైదీలకు వేయాల్సిన సంకెళ్లను ఏకంగా పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకే వేసిన దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఠాణా ప్రాంగణంలోకి ఇతర వాహనాలు, అనధికార…
- సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష విరమణ.దేశ విద్యావ్యవస్థలో పారదర్శకత, సమగ్ర సంస్కరణల కోసం గత 26 రోజులుగా లడఖ్ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎట్టకేలకు ముగిసింది. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన కీలక చర్చల అనంతరం ఆయన తన సుదీర్ఘ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.