స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో విధుల దుర్వినియోగం…

Abuse of Duties in the Special Intelligence Bureau

Advertisements

&NewLine;<p>గత ప్రభుత్వం హయాంలో విపక్ష నేతలపై ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు అలియాస్ ప్రణీత్‌కుమార్‌ అరెస్టయ్యారు&period; పంజాగుట్ట పోలీసులు ఆయనను రాజన్న- సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు&period; స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో విధుల దుర్వినియోగం&comma; అనధికారిక ఫోన్‌ ట్యాపింగ్&comma; కంప్యూటర్ ధ్వంసం కేసులో ప్రణీత్‌ రావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు&period; గత ప్రభుత్వంలో ప్రణీత్‌రావు ఎస్‌ఐబీలో డీఎస్పీగా పనిచేశారు&period; గత ఏడాది డిసెంబర్ 4à°¨ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు ప్రణీత్ రావు కంప్యూటర్లు&comma; హార్డ్‌డిస్క్‌లను కాల్చివేశారంటూ ఎస్‌బీఐ అదనపు ఎస్పీ à°¡à°¿ రమేశ్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు&period; ఈ మేరకు పోలీసులు ఆయనపై ఐపీసీ&comma; పీడీపీపీ&comma; ఐటీ చట్టాల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు&period; ఇక ప్రణీత్‌రావు సస్పెన్షన్‌కు మునుపు రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీఆర్బీలో డీఎస్పీగా పనిచేశారు&period; అయితే&comma; సస్పెన్షన్ తరువాత జిల్లా కేంద్రం దాటి వెళ్లకూడదని ఆదేశించారు&period; ప్రణీత్ రావును అరెస్ట్ చేసి పంజాగుట్ట ఠాణాలో విచారణ చేస్తున్నారు&period; విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్‌కు ఆదేశాలు ఇచ్చిందెవరు&quest; ఎస్‌ఐబీలో ఎవరి ప్రోద్బలం ఉంది&quest; ఫోన్‌ ట్యాపింగ్ సమాచారాన్ని ఎవరికి చేరవేశారు&quest; ధ్వంసం చేసిన కంప్యూటర్లు&comma; హార్డ్‌డిస్క్‌లో ఏ సమాచారం ఉంది&quest; అనే కోణాల్లో ఆయనను విచారిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..

ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు..

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..