మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మున్సిపల్ కార్యాలయం లో ఏసీబీ దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటుండగా మేనేజర్ శ్రీహరి , బిల్ కలెక్టర్ మహేందర్ ను అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డిఎస్ పి( Dsp) రమణ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. లక్షేట్టిపేట మున్సిపల్ పరిధిలోని ఇటీక్యాల గ్రామానికి చెందిన ఆకుల శ్రీనివాస్ అనే వ్యక్తి తన ఇంటికి నెంబర్ కేటాయించడానికి మే నెలలో మున్సిపల్ కార్యాలయం లో దరఖాస్తు చేసుకొన్నాడు. నెంబర్ కేటాయించడానికి లక్ష రూపాయలు లంచం ఇవ్వాలని మేనేజర్ శ్రీహరి డిమాండ్ చేసాడు. బాధితుడు శ్రీనివాస్ చివరికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకొని
బాధితుడు ఆదిలాబాద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దింతో బాధితుడు శ్రీనివాస్ నుంచి పదిహేను వేల రూపాయలు లంచం తీసుకొంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
మున్సిపల్ కార్యాలయం లో ఏసీబీ దాడులు…
68
previous post