మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మున్సిపల్ కార్యాలయం లో ఏసీబీ దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటుండగా మేనేజర్ శ్రీహరి , బిల్ కలెక్టర్ మహేందర్ ను అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డిఎస్ పి( Dsp) రమణ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. లక్షేట్టిపేట మున్సిపల్ పరిధిలోని ఇటీక్యాల గ్రామానికి చెందిన ఆకుల శ్రీనివాస్ అనే వ్యక్తి తన ఇంటికి నెంబర్ కేటాయించడానికి మే నెలలో మున్సిపల్ కార్యాలయం లో దరఖాస్తు చేసుకొన్నాడు. నెంబర్ కేటాయించడానికి లక్ష రూపాయలు లంచం ఇవ్వాలని మేనేజర్ శ్రీహరి డిమాండ్ చేసాడు. బాధితుడు శ్రీనివాస్ చివరికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకొని
బాధితుడు ఆదిలాబాద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దింతో బాధితుడు శ్రీనివాస్ నుంచి పదిహేను వేల రూపాయలు లంచం తీసుకొంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
Tag:
Municipal Office
అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ కార్యాలయం ప్రాంగణం నందు రూ. 2.40 లక్షల వ్యయం తో నిర్మించిన మున్సిపల్ సభా భవనం ను ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ గిరిషా పిఎస్ లు ప్రారంభించారు. సభా భవనం పేరును డాక్టర్ వైఎస్సార్ సభ భవనం గా పేరు మార్పు. చైర్మన్ ఫయాజ్ బాషా అధ్వర్యంలో వారికి కౌన్సిలర్ సభ్యులు తో పాటు వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. మత ప్రార్థనల అనంతరం నూతన భవనంలో చైర్మన్ షేక్ ఫయాజ్ బాషా, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ గిరీషా పీఎస్ ఆసీనులైనారు. వారికి కౌన్సిలర్లు శాలువాలతో సన్మానించి గజమాలతో సత్కరించారు.
Read Also..





Total views : 78441