జగన్మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కరువవడంతో ”కోడికత్తి 2.0(Kodikatthi 2.0)”కి తెరలేపారన్నారు టీడీపీ సీనియర్ నాయకుడు కింజరాపు అచ్చెన్నాయుడు(Kinjarapu Achchennaidu). ముఖ్యమంత్రి పర్యటన జరుగుతుంటే కరెంటు తీసేయడం ముందుగా వేసుకున్న పథకంలో భాగం కాదా అని ప్రశ్నించారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేయించుకున్న దాడే అని ఆరోపించారు. డీజీపీ, ఇంటిలిజెన్స్ ఐజి నేతృత్వంలో రూపొందించిన డ్రామా అన్నారు.
ఇది చదవండి:టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో ఆత్మీయ సమావేశం..
2019 ఎన్నికలకు ముందుకు విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తి డ్రామాకు, సింగ్ నగర్ లో సీఎంపై జరిగిన గులకరాయి దాడికి పెద్ద తేడా ఏమీ లేదని ఎద్దేవా చేశారు. సంఘటన జరిగిన నిమిషాల వ్యవధిలోని జగన్ అండ్ కో పేర్నినాని, అంబటి రాంబాబు లైన్ లోకి వచ్చి ఇదంతా చంద్రబాబు చేయించాడని నీలి మీడియాలో ప్రచారం చేయడం ముందస్తు ప్రణాళికలో భాగం కాదా అని ప్రశ్నించారు. ఎన్ని నాటకాలు ఆడినా ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News