81
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సెప్టెంబర్ 2న విజయవంతంగా ప్రయోగించిన ఆదిత్య ఎల్1 మిషన్‌పై ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఆదిత్య ఎల్1 మిషన్ జనవరి 6న సూర్యుడికి దగ్గరగా ఉండే ఎల్1 పాయింట్‌లోకి ప్రవేశిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు అంచనా వేశామని, ఖచ్చితమైన సమయాన్ని నిర్ధిష్ట సమయంలో ప్రకటిస్తామని చెప్పారు. గాంధీనగర్‌లో శుక్రవారం జరిగిన ‘వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024 లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆదిత్య ఎల్1 మిషన్‌కు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నారు.