67
కేసీఆర్ అధికారంలోకి వచ్చి తొమ్మిదిన్నరేళ్లయిందని, ఈ సమయంలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నర్సాపూర్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ విజయభేరీ యాత్రలో రేవంత్ పాల్గొన్నారు. తెలంగాణ వస్తే ప్రజల జీవితాలు బాగుపడతాయనుకుంటే రైతుల ఆత్మహత్యలు కలిచివేశాయన్నారు. నిరుద్యోగంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఇచ్చిన ఏ హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు తమ పార్టీ చేసిన అభివృద్ధి గురించి చెప్పకుండా కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారన్నారు. వచ్చే నెలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.