ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) తిహార్ జైల్లో ఆరోగ్యంగానే ఉన్నారని ఢిల్లీలోని ఎయిమ్స్ మెడికల్ బోర్డ్ (AIIMS Medical Board)స్పష్టం చేసింది. టైప్-2 డయాబెటీస్‌తో బాధ పడుతున్న ఆయన ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాల మేరకు ఎయిమ్స్ కు చెందిన ఐదుగురు సభ్యుల మెడికల్ బోర్డు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. దాదాపు అరగంట పాటు ఎయిమ్స్ వైద్యులు సీఎంతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కేజ్రీవాల్ ప్రస్తుతం ఉపయోగిస్తున్న మందులనే కొనసాగించాలని మెడికల్ బోర్డు సూచించింది. మెడిసిన్‌లో మార్పులు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. దీంతో పాటు ఆయనకు రెండు యూనిట్ల ఇన్సులిన్ డోసును కొనసాగించాలని ఎయిమ్స్ మెడికల్ బోర్డ్ తెలిపిందని అధికారులు తెలిపారు.
- త్వరలో ఆపిల్ ఐఫోన్ 17 ఎయిర్ విడుదలఐఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. ఎన్నిరకాల ఫోన్లు విడుదలైనప్పటికీ ఐఫోన్ కు ఉండే క్రేజ్ అసలు తగ్గలేదు. వినియోగదారుల అవసరాలకు తగినట్టుగానే ఆపిల్ కంపెనీ నుంచి ఫోన్లు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆపిల్ కస్టమర్లకు ఇంకో…
- న్యూఢిల్లీ బరిలో కేజ్రీవాల్, కల్కాజీ నుంచి సీఎం అతిషీఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ చివరిదైన నాలుగో జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో 38 మంది అభ్యర్థుల పేర్లను ఆప్ ప్రకటించింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి, కల్కాజీ స్థానం…
- బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీ కడుతున్నాంరాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. రాష్ట్ర అప్పులకు సంబంధించి తమ దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయని తెలిపారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.