బీజేపీ(YCP) మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తారని కాంగ్రెస్(Congress) నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన ఆరోపణలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) తోసిపుచ్చారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకే రాహుల్ గాంధీ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలో ఉన్నంతవరకూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై పునరాలోచన ఉండదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ తమపై దుష్ప్రచారం సాగిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
తాము పదేండ్లుగా పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్నామని రిజర్వేషన్లకు స్వస్తి పలకాలని అనుకుంటే ఈపాటికే అలాంటి నిర్ణయం తీసుకునేవారమని అమిత్ షా పేర్కొన్నారు. రిజర్వేషన్లను రద్దు చేసే ఆలోచన తమకు లేనేలేదని తేల్చిచెప్పారు. రాహుల్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్నంతవరకూ రిజర్వేషన్లను తొలగించే అధికారం, దమ్ము ఎవరికీ లేదని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే బీసీలు, దళితులు, ఆదివాసీ సోదరులకు భరోసా ఇచ్చారని ఆయన గుర్తుచేశారు.
- త్వరలో ఆపిల్ ఐఫోన్ 17 ఎయిర్ విడుదలఐఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. ఎన్నిరకాల ఫోన్లు విడుదలైనప్పటికీ ఐఫోన్ కు ఉండే క్రేజ్ అసలు తగ్గలేదు. వినియోగదారుల అవసరాలకు తగినట్టుగానే ఆపిల్ కంపెనీ నుంచి ఫోన్లు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆపిల్ కస్టమర్లకు ఇంకో…
- న్యూఢిల్లీ బరిలో కేజ్రీవాల్, కల్కాజీ నుంచి సీఎం అతిషీఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ చివరిదైన నాలుగో జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో 38 మంది అభ్యర్థుల పేర్లను ఆప్ ప్రకటించింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి, కల్కాజీ స్థానం…
- బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీ కడుతున్నాంరాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. రాష్ట్ర అప్పులకు సంబంధించి తమ దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయని తెలిపారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.