తెలంగాణలో అమిత్ షా టూర్ షెడ్యూల్:
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ(Telangana)లో పర్యటించనున్నారు. ఈ మేరకు అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. వచ్చే నెల మార్చి 4వ తేదీన అమిత్ షా తెలంగాణకు రానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీ- బీజేపీ చేపట్టిన విజయ సంకల్పయాత్ర ముగింపు సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ నెల 24వ తేదీన అమిత్ షా తెలంగాణ పర్యటనకు రావాల్సి ఉండగా పలు కారణాల వల్ల స్టేట్ టూర్ క్యాన్సిల్ అయ్యింది.
చేవెళ్ల కార్యకర్తలతో సమావేశమైన మంత్రి శ్రీధర్ బాబు…
దీంతో మార్చి 4న ఆయన తెలంగాణకు రానున్నారు. కాగా, తెలంగాణ(Telangana)లో బీజేపీ 10 ఎంపీ సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విజయ సంకల్ప యాత్ర చేపట్టింది. ఈ నెల 16వ తేదీన బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో ఈ యాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర కోసం బీజేపీ రాష్ట్రాన్ని ఐదు క్లస్టర్లుగా విభజించింది.
ఐదు క్లస్టర్లలో యాత్ర మొదలుపెట్టి చివరగా హైదరాబాద్‌లో ముగించనున్నారు. ఈ యాత్రలో స్టేట్ బీజేపీ అగ్రనేతలతో పాటు జాతీయ నాయకులు పాల్గొంటారు. విజయసంకల్ప యాత్ర మార్చి 4వ తేదీన ముగియనుంది. యాత్ర ముగింపు సభను భారీగా నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలోనే యాత్ర క్లోజింగ్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.