చంద్రబాబు నాయుడుకు తేదేపా పార్టీకి ప్రజల నుంచి విశేషమైన, ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో రాయదుర్గం నియోజకవర్గం లో వందలాది కుటుంబాలు తేదేపా లో చేరడం శుభపరిణామం అని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు నివాసం లి ఆయుత పల్లికి చెందిన 29 కుటుంబాలు, పైతోట గ్రామంలోనీ 40కుటుంబాలు తేదేపా పార్టీ లో చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ తేదేపా పార్టీ లో చేరిన వారందరూ తాను రాయదుర్గం లో ఎమ్మెల్యే కావాలని, ఇప్పుడు ఉన్న సమస్యలు తీరాలని, ఈ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు ఆయన తో ఆవేదన చెందినట్లు తెలిపారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత పెన్షన్ సరిగా ఇవ్వడం లేదని, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందడం లేదని నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలని రాయదుర్గం లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తేనే ప్రజా సమస్యలు, రైతుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.
తెలుగుదేశం పార్టీలోకి వందలాది కుటుంబాల చేరిక…
80
previous post