చోడవరం మండలం నర్సాపురం గ్రామంలో కొంతమంది యాదవులు కొండ పోరంబోకు స్థలాన్ని ఉమ్మడిగా ఉపయోగించుకుంటూ వుండగా రెవెన్యూ వర్గాలు ఈ మధ్య ఆ పాకలను తొలగించడంతో ఈ విషయం లో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ధర్మ శ్రీ సహాయం కోరేందుకు యాదవ మహిళలు ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లగా, సమస్యలు చెప్పిన మహిళలతో ఆయన మీ గొల్లలు అంతా గొర్రెలను మేకలను, పశువులను సంతలో అమ్ముకొని, మీరు కంచాలు పట్టుకొని ఊరులో అడుక్కుతినండి లేదా దొంగతనాలు చేసుకు బతకండి అని హేళన చేసారని నరసాపురం గ్రామానికి చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకలు పెంపకం దారులు సంఘం, జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి సభ్యులు తీవ్రంగా ఖండిస్తూ… ఇప్పటికైనా MLA కరణం ధర్మశ్రీ ఈ విధంగా మాట్లాడడం సరైయింది కాదని గతంలో కూడా ఒక సందర్భంలో ఆయన ఈ విధంగానే యాదవులను కించపరుస్తూ మాట్లాడారని ఆయనకు ఎమ్మెల్యే గా వుండే అర్హత లేదని బేషరతుగా యాదవ మహిళలకు క్షమాపణ చెప్పకపోతే ఆయన కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు.
మహిళలపై చోడవరం ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు…
72
previous post