Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి…

మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి…

by Prakash
Mahashivratri wedding celebration

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపూడి పంచారామక్షేత్రాల లో ఒక్కటైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి కళ్యాణం మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి డి. రామకృష్ణంరాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని వసతి సౌకర్యాలు కల్పించామని స్వామి వారిని దర్శించుకునేందుకు అవసరమైన క్యూలైన్లు ఏర్పాటు చేశామని, భక్తులకు ఉచిత అన్న ప్రసాదాలతో పాటు చిన్న పిల్లలకు పాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్వామి వారికి ప్రత్యేక పూజలతో రుద్రాభిషేకం, స్వామివార్ల గ్రామోత్సవము, శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి పాంచాహ్నిక దీక్షా కళ్యాణ మహోత్సవము, రధోత్సవము, తెప్పోత్సవము జరుగుతాయన్నారు. భక్తులంతా పాల్గొని శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వార్ల ఆశీస్సులు పొందాలన్నారు.

Advertisements

You may also like

Our Visitor

023232
Total views : 141613

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.