నేడు అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో నిన్న రియాక్టర్ పేలిన ఘటననలో మృతుల సంఖ్య 17 కు చేరుకుంది. ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారి కుటుంబాలతోపాటు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని సీఎం పరామర్శించనున్నారు. ప్రమాద ఘటన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి పరిశీలిస్తారు.
ప్రమాద ఘటనపై ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, పరిశ్రమల శాఖ కార్యదర్శి, పరిశ్రమల శాఖ సంచాలకుడు, కార్మిక శాఖ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ బాయిలర్స్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు జిల్లా ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. తీవ్రంగా గాయపడిన 41 మందికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అవసరమైతే క్షతగాత్రులను విశాఖకు లేదా హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించాలని సూచించారు. అచ్యుతాపురం వెళ్లాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని చంద్రబాబు ఆదేశించారు.
- మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..ఏలూరు కలెక్టరేట్ సాక్షిగా హైడ్రామా నడిచింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కాస్తా… అధికారులకు, వైకాపా నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదానికి వేదికగా మారింది. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కళ్లెదుటే వైకాపా నాయకులు, ఏలూరు మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్…
- వరంగల్‌లో డీఆర్ఐ అధికారుల సంచలన ఆపరేషన్..వరంగల్‌లో అంతర్జాతీయ స్మగ్లర్ల తరహాలో సాగుతున్న వన్యప్రాణుల అక్రమ రవాణా గుట్టును డిరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు రట్టు చేశారు. గ్రే మార్కెట్లో అత్యంత ఖరీదైన, అంతరించిపోతున్న అరుదైన సజీవ పాములను విక్రయిస్తున్న ఒక ముఠా సభ్యుడిని సినీ ఫక్కీలో…
- పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కేవలం మాటలకే పరిమితం కాదని స్వయంగా ఆచరించి చూపించారు జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్. సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక…
- Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..పంజాబ్ కింగ్స్‌కు ఇది వరుసగా 6వ ఓటమి, దీంతో వారి సీజన్ పూర్తిగా తలకిందులైంది. ప్లేఆఫ్స్ రేస్ వేడెక్కుతున్న ఈ సమయంలో ఇది Chennai Super Kings, Kolkata Knight Riders, Rajasthan Royals మరియు బహుశా Delhi Capitals వంటి…
- Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు స్వల్ప తేడాతో విజయం సాధించింది. అబిషేక్ పోరెల్ మరియు KL రాహుల్ తమ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పవర్‌ప్లేలో 72 పరుగులు వచ్చాయి, 10వ ఓవర్ ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 105/0 వద్ద…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 80472