కార్పోరేట్ కు ధీటుగా రాయచోటి వంద పడకల ఆసుపత్రిని తీర్చిదిద్దుదామని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం జరిగిన రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడి హోదాలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, వైస్ చైర్మన్ ఫయాజర్ రెహమాన్, కమిటీ సభ్యులు బేపారి మహమ్మద్ ఖాన్, ఫమీదా లతో కలసి ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారన్నారు. ఇక్కడి పనిచేస్తున్న వైద్యాధికారులు, సిబ్బంది సమిష్టి కృషితో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి అంటే రోగులకు ధైర్యం, నమ్మకం భరోసా కలిగేలా సేవలు అందేలా చూడాలన్నారు. లీవ్, డిప్యుటేషన్ల తో ఖాళీ వైద్యుల పోస్టులను త్వరిత గతిన భర్తీ చేసుకోవాలన్నారు. వంద పడకల ఆసుపత్రి ప్రారంభానికి ముందే, ఇప్పటి నుంచే వసతులను పెంచాలన్నారు. మూడు ఆపరేషన్ థియేటర్లను అందుబాటులోకి త్వరగా తీసుకు రావాలన్నారు. ఏసీ లు, లిఫ్ట్ ల ఏర్పాటుపై చర్చించారు ఆక్సిజన్ ప్లాంట్ వాడకంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఏయే విభాగాలకు ఎన్నెన్ని ఆక్సిజన్ బెడ్లు అవసరమో ఆయన ఆసుపత్రి పర్యవేక్షకుడు డా టి డేవిడ్ సుకుమార్ మరియు వైద్యాధికారులను ఆరా తీశారు. ఆక్సిజన్ ను నిల్వ ఉంచే ఏర్పాట్లపై చర్చించారు. సమిష్టి కృషి సహకారంతో రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలను కల్పించాలన్నారు. వైద్య పరీక్షల నిర్వహణపై ఆయన ఆరా తీశారు. నూతన భవనాలలో సోమవారం నుంచే వైద్య సేవలు ప్రారంభం కావాలన్నారు.విభాగాల కేటాయింపు, వైద్య పరికరాలు ఏర్పాటు చర్యలను ఇప్పటి నుంచే ప్రారంభించాలన్నారు. త్రాగునీటి సరఫరా చర్యలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రోజూ సుమారు 750 మంది కి పైగా ఓపి కి రోగులు వస్తున్నారని,వారికి నాణ్యమైన, సంతృప్తికరమైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. అల్ట్రా సౌండ్ పరీక్షలలో మహిళలకోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. మెడికల్స్, సర్జికల్ విభాగాల నిర్వహణకు ఏడాదికి రూ 80 లక్షల మేర వ్యయం అవుతుందని అధికారులు తెలిపారు. ట్రామా కేర్, కార్డియాలజీ సేవల ఏర్పాటుకు కృషి చేద్దామన్నారు. ఆసుపత్రి పరిశుభ్రత,పారిశుధ్యం మెరుగణకు మరింత చర్యలు చేపట్టాలన్నారు. ఆర్చి, రహదారుల నిర్మాణాలపై ఆయన ఆరా తీశారు.ఈ నెల 17 నుంచి 21 వ తేదీలోగా వందపడకల ఆసుపత్రి భవన నిర్మాణాల ను ప్రారంభించేందుకు సిద్ధమవుదామన్నార. డయాల్ సిస్ కేంద్రం మరింత అభివృద్ధికి కృషి చేస్తామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.ప్రస్తుతం ఉన్న డయాల్ సిస్ కేంద్ర భవనాన్ని కూడా నూతన భవనాలలోని అన్ని వసతులుతో కూడిన భవనంలోకి మార్చాలన్నారు. ప్రారంభానికి సిద్దమవుతున్న నూతన భవనాలను శ్రీకాంత్ రెడ్డి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్చిలు, రహదారుల నిర్మాణాలను పరిశీలించారు.ఆసుపత్రి ప్రాంగణంలో మంచి చెట్లు నాటి పచ్చదనం పెంపొందించాలని మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, వైద్యాధికారులుకు ఆయన సూచించారు.మానసిక ప్రశాంతత, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేలా చేద్దామన్నారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డా బండారు కిరణ్ కుమార్, డా రెడ్డి మహేశ్వర రాజు, డా రెడ్డి భాస్కర్ రెడ్డి, డా లక్ష్మీ ప్రసాద్, డా కోటేశ్వరి,డా ఖదీర్,ఏ పి ఎం ఎస్ ఐ డి సి డిఈ రాజగోపాల్ రెడ్డి,కౌన్సిలర్లు ఆసీఫ్ అలీఖాన్, కొలిమి ఛాన్ బాష, షబ్బీర్, ఫయాజ్ అహమ్మద్,రియాజ్, గౌస్ ఖాన్, కసిరెడ్డి వెంకట నరసింహా రెడ్డి, అన్నా సలీం,కొత్తపల్లె ఇంతియాజ్. తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం…
86
previous post