అన్నమయ్య జిల్లా రాయచోటి లో ఎల్లవేళలా తాము పేదలకు అండగా ఉంటామని ఎం ఎల్ ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ పరిధిలోని మాసాపేట 2 వ వార్డులో రూ 15 లక్షల నిధులతో సిసి రోడ్డు, 34 వ వార్డులో 80 లక్షల, గడప గడపకు మరియు మున్సిపల్ నిధులుతో పూర్తయిన సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ ల శిలాపలకాలను, రూ 9 లక్షల సోలార్ నిధులుతో మినరల్ వాటర్ ప్లాంట్, రూ 9 లక్షల మెప్మా సి ఆర్ సి భవన ప్రారంభాలను మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, కౌన్సిలర్లు సుగవాసి పద్మావతి, గూడూరు అమ్మాజీ తదితర నాయకులతో కలసి శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. భారీ జన సందోహం మధ్య, పండుగ వాతావరణంలో అభివృద్ధి పనుల ప్రారంబోత్సవాలను శ్రీకాంత్ రెడ్డి నిర్వహించారు. ఈ సంధర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అహంభావం, అహంకారం, రౌడీయిజం లేకుండా, సామరస్యంగా ఉంటూ మరింత బాధ్యత తో రాయచోటి ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. మాసాపేట ఒకప్పుడు ఎంతో వెనుకబడి ఉండేదని, జిల్లా కేంద్రం ఏర్పాటుతో నెంబర్ 1 స్థానంలో ఉందన్నారు. జగన్ పాలనలోఅర్హతే ఆధారంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. వందపడకల ఆసుపత్రి, 4 అర్బన్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్ స్టాండ్ విస్తరణ, డైట్ మున్సిపల్ పార్క్, రైతు బజార్, క్రికెట్ స్టేడియం, నగరవనం, శిల్పారామంలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. కరోనా సమయంలో ఎక్కడా భయపడకుండా ఆసుపత్రులలోకి వెళ్లి రోగులతో మమేకం అయ్యి, రోగులకు ధైర్యం కల్పించామన్నారు. రూ 30 లక్షల సొంత డబ్బులతో ఆనందయ్య మందును ఇంటింటా పంపిణీ చేసి ప్రజలకు తోడుగా నిలిచామన్నారు. చంద్రబాబు డ్వాక్రా రుణాలను మాపీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. సీఎం జగన్ 99 శాతానికి పైగా హామీలను నెరవేర్చారన్నారు. మాసాపేట అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారిస్తామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. మాసాపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేసిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి కి స్థానిక కౌన్సిలర్లు, నాయకులు ఘన స్వాగతాలు పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ గంగా ప్రసాద్, మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్, జి ఎం డి ఇమ్రాన్, జి ఎం డి ఇర్షాద్, సుగవాసి శ్యామ్, సుగవాసి ఈశ్వర్ ప్రసాద్, కొలిమి హారూన్, విక్కీ దేవేంద్ర, జావీద్, అమీర్, కో ఆప్షన్ సభ్యులు అయ్యావారు రెడ్డి, హజరత్ ఖాదర్ వలీ, అన్నా సలీం, వాల్మీకి సంఘ జిల్లా అధ్యక్షుడు గువ్వల బుజ్జిబాబు, నూర్ బాష సంఘ జిల్లా అధ్యక్షుడు మౌలా, జె సి ఎస్ కన్వీనర్ నవరంగ్ నిస్సార్, ఆసీఫ్ అలీఖాన్, రౌనక్,మాజీ కో ఆప్షన్ జాఫర్ అలీ ఖాన్,ఆర్ట్స్ శంకర్, కొత్తిమీర ప్రసాద్, చాను, గగ్గుటూరి ఇబ్రహీం, జుళ్ళూ, బాబయ్య, మాజ్,మస్తాన్,ఖాదర్ వలీ, అబ్దుల్ రహీం ,షామీర్,అమీర్, ఖాదర్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు.
Anna Salim
కార్పోరేట్ కు ధీటుగా రాయచోటి వంద పడకల ఆసుపత్రిని తీర్చిదిద్దుదామని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం జరిగిన రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడి హోదాలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, వైస్ చైర్మన్ ఫయాజర్ రెహమాన్, కమిటీ సభ్యులు బేపారి మహమ్మద్ ఖాన్, ఫమీదా లతో కలసి ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారన్నారు. ఇక్కడి పనిచేస్తున్న వైద్యాధికారులు, సిబ్బంది సమిష్టి కృషితో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి అంటే రోగులకు ధైర్యం, నమ్మకం భరోసా కలిగేలా సేవలు అందేలా చూడాలన్నారు. లీవ్, డిప్యుటేషన్ల తో ఖాళీ వైద్యుల పోస్టులను త్వరిత గతిన భర్తీ చేసుకోవాలన్నారు. వంద పడకల ఆసుపత్రి ప్రారంభానికి ముందే, ఇప్పటి నుంచే వసతులను పెంచాలన్నారు. మూడు ఆపరేషన్ థియేటర్లను అందుబాటులోకి త్వరగా తీసుకు రావాలన్నారు. ఏసీ లు, లిఫ్ట్ ల ఏర్పాటుపై చర్చించారు ఆక్సిజన్ ప్లాంట్ వాడకంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఏయే విభాగాలకు ఎన్నెన్ని ఆక్సిజన్ బెడ్లు అవసరమో ఆయన ఆసుపత్రి పర్యవేక్షకుడు డా టి డేవిడ్ సుకుమార్ మరియు వైద్యాధికారులను ఆరా తీశారు. ఆక్సిజన్ ను నిల్వ ఉంచే ఏర్పాట్లపై చర్చించారు. సమిష్టి కృషి సహకారంతో రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలను కల్పించాలన్నారు. వైద్య పరీక్షల నిర్వహణపై ఆయన ఆరా తీశారు. నూతన భవనాలలో సోమవారం నుంచే వైద్య సేవలు ప్రారంభం కావాలన్నారు.విభాగాల కేటాయింపు, వైద్య పరికరాలు ఏర్పాటు చర్యలను ఇప్పటి నుంచే ప్రారంభించాలన్నారు. త్రాగునీటి సరఫరా చర్యలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రోజూ సుమారు 750 మంది కి పైగా ఓపి కి రోగులు వస్తున్నారని,వారికి నాణ్యమైన, సంతృప్తికరమైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. అల్ట్రా సౌండ్ పరీక్షలలో మహిళలకోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. మెడికల్స్, సర్జికల్ విభాగాల నిర్వహణకు ఏడాదికి రూ 80 లక్షల మేర వ్యయం అవుతుందని అధికారులు తెలిపారు. ట్రామా కేర్, కార్డియాలజీ సేవల ఏర్పాటుకు కృషి చేద్దామన్నారు. ఆసుపత్రి పరిశుభ్రత,పారిశుధ్యం మెరుగణకు మరింత చర్యలు చేపట్టాలన్నారు. ఆర్చి, రహదారుల నిర్మాణాలపై ఆయన ఆరా తీశారు.ఈ నెల 17 నుంచి 21 వ తేదీలోగా వందపడకల ఆసుపత్రి భవన నిర్మాణాల ను ప్రారంభించేందుకు సిద్ధమవుదామన్నార. డయాల్ సిస్ కేంద్రం మరింత అభివృద్ధికి కృషి చేస్తామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.ప్రస్తుతం ఉన్న డయాల్ సిస్ కేంద్ర భవనాన్ని కూడా నూతన భవనాలలోని అన్ని వసతులుతో కూడిన భవనంలోకి మార్చాలన్నారు. ప్రారంభానికి సిద్దమవుతున్న నూతన భవనాలను శ్రీకాంత్ రెడ్డి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్చిలు, రహదారుల నిర్మాణాలను పరిశీలించారు.ఆసుపత్రి ప్రాంగణంలో మంచి చెట్లు నాటి పచ్చదనం పెంపొందించాలని మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, వైద్యాధికారులుకు ఆయన సూచించారు.మానసిక ప్రశాంతత, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేలా చేద్దామన్నారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డా బండారు కిరణ్ కుమార్, డా రెడ్డి మహేశ్వర రాజు, డా రెడ్డి భాస్కర్ రెడ్డి, డా లక్ష్మీ ప్రసాద్, డా కోటేశ్వరి,డా ఖదీర్,ఏ పి ఎం ఎస్ ఐ డి సి డిఈ రాజగోపాల్ రెడ్డి,కౌన్సిలర్లు ఆసీఫ్ అలీఖాన్, కొలిమి ఛాన్ బాష, షబ్బీర్, ఫయాజ్ అహమ్మద్,రియాజ్, గౌస్ ఖాన్, కసిరెడ్డి వెంకట నరసింహా రెడ్డి, అన్నా సలీం,కొత్తపల్లె ఇంతియాజ్. తదితరులు పాల్గొన్నారు.





Total views : 78311