ఎలక్షన్ కమీషన్ వారి ఆదేశాల మేరకు పల్నాడు (Palnadu) జిల్లా నూతన ఎస్పీ గరికపాటి బిందు మాధవ్ ఐ.పి.యస్ (Garikapati Bindu Madhav IPS) జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలలో ఎలక్షన్ కమిషన్ వారి గైడ్ లైన్స్ ప్రకారం జిల్లాలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేటట్లు చేయడమే తన ప్రథమ కర్తవ్యమన్నారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ స్వేచ్ఛాయుత, పారదర్శక, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తామన్నారు.
ఎవరైనా దాడులకు, చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు. గతంలో బిందు మాధవ్ ఐపీఎస్ ఉమ్మడి గుంటూరు జిల్లా SEB జాయింట్ డైరెక్టర్ గా, తర్వాత నూతన పలనాడు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ గా విధులు నిర్వహించారు. తదనంతరం ప్రమోషన్ పొంది గ్రేహౌండ్స్ నందు ఎస్పీగా పనిచేశారు.
ఇది చదవండి: రాష్ట్ర సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతాచర్యలు తీసుకుంటున్నాం..
Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి