పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మేనిఫెస్టో ప్రెస్ మీట్ నిర్వహించిన యరపతినేని శ్రీనివాసరావు (Yarapathineni Srinivasarao) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు కూడా న్యాయం జరిగేలా తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తయారు చేశారని కొనియాడారు. 200 వందల రూపాయలు ఉన్న పెన్షన్ 2000 చేసింది కూడా చంద్రబాబు నాయుడేనని 2019 ఎలక్షన్ కు ముందు పెన్షన్ 3000 చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్ కు 3000 పెన్షన్ చేయడానికీ సంవత్సరానికి ₹250 చొప్పున ఐదు సంవత్సరాలు పట్టిందని అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అలాగే 2024 ఎలక్షన్ మేనిఫెస్టో హామీలో కూడా 3000 పెన్షన్ దశలవారీగా 3500 చేస్తానని జగన్ అన్నారని అంటే రెండు సంవత్సరాలు రెండు వందల యాభై రూపాయలు చొప్పున అధికారంలోకి వస్తే ఇంకో ఐదు సంవత్సరాలు పడుతుంది జగన్ నీకు 3500 పెన్షన్ చేయడానికి అని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే 3000 పెన్షన్ ను ఏప్రిల్ నెల నుంచి 3500 ఇస్తామని అన్నారు. వ్యవస్థలను కుటుంబ సభ్యులను గౌరవించని జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఏం గౌరవిస్తారని అన్నారు. జూన్ 4 తర్వాత జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ ఇంటికి సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారని యరపతినేని శ్రీనివాసరావు అన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
- మాజీ MLA వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం …మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు కృష్ణాజిల్లా గన్నవరంలోని వీరవల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల దౌర్జన్య కాండకు టీడీపీ నేత మాదాల శ్రీనివాసరావు నష్టపోయారని ఫిర్యాదులో తెలిపారు. తన…