రాష్ట్రంలో కులమతాలకు, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని చిలకలూరిపేట నియోజకవర్గ వైసిపి అభ్యర్ధి కావటి శివనాగ మనోహర్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో చిలకలూరిపేట నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. సాగునీరు, త్రాగునీరు శాశ్వతంగా అందించే దిశగా తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. అలాగే పట్టణంలో ఉన్న ప్రధాన సమస్య ఆటో నగర్.. అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి పనిగా ప్రారంభించేది ఆటో నగర్ కార్యక్రమం అని పేర్కొన్నారు. ఖచ్చితంగా చిలకలూరిపేటలో మరోసారి వైసిపి జెండాను ఎగురవేసి, తనను అత్యధిక మెజారిటీతో గెలిపించటానికి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డియాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు. ఈవేళ సీఎం రేవంత్‌రెడ్డి పుట్టిన రోజు కావడంతో హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాఫ్టర్‌లో యాదగిరి గుట్టుకు చేరుకున్నారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో వేద పండితులు ప్రత్యేక…
- బోరుగడ్డ అనిల్ కు రాచమర్యాదలుఏడుగురు పోలీసులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు వేటు వేసింది. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌ను జైలుకు తరలించే క్రమంలో ఆయనకు రాచమర్యాదలు చేశారు. బోరుగడ్డ అనిల్‌ను గన్నవరం క్రాస్ రోడ్డులోని ఓ రెస్టారెంట్లోకి…
- గవర్నర్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి..రాజ్ భవన్ లో గవర్నర్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి