ఏపీ ముఖ్యమంత్రి జగన్ తనకు న్యాయం చేయాలని కోరుతూ కోడికత్తి దాడి కేసు నిందితుడు శ్రీను విశాఖ జైల్లో నిరాహార దీక్షను చేపట్టాడు. అతని ఆరోగ్యం క్షీణించిందని దళిత సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయవాదుల సమక్షంలో దళిత సంఘం నేతలు శ్రీనును కలిశారు. అయితే, అతను నడవలేని పరిస్థితిలో ఉన్నాడని.. ఒక జైలు అధికారి, మరో ఖైదీ శ్రీనును చేతులతో మోసుకొచ్చారని వారు తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి శ్రీను నిరాహారదీక్షను కొనసాగిస్తున్నాడని.. అయినప్పటికీ జైలు అధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదని దళిత సంఘాల నేతలు చెప్పారు. జైల్లో శ్రీనుకు ప్రాణహాని జరిగే అవకాశం ఉందని.. అక్కడి నుంచి శ్రీనును తరలించాలని డిమాండ్ చేశారు. శ్రీను హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని కోరుతూ జిల్లా లీగల్ అథారిటీలో ఆయన తరపు న్యాయవాది సలీం పిటిషన్ వేశారు.
Read Also..